అమీ జాక్సన్ నటన గురించి ఎవరూ మాట్లాడుకోరు. ఎంతసేపు ఆమె అందం గురించి, ఆమె ప్రదర్శించే షో గురించే. అవును మరి అభినయం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదక్కడ. ఐతే అందాల ఆరబోత విషయంలో మాత్రం ఆమె ఎవర్నీ డిస్‌ప్పాయింట్ చేయదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్ ఓపెన్ చేస్తే కుర్రకారుకి కావాల్సినంత టైమ్ పాస్.
తాజాగా ఆమె కొత్త ఇంట్లోకి మకాం మార్చిందట. కొత్త ఇంట్లోకి అడుగుపెడితే పాలు పొంగిస్తారు. ఆమె బ్రిటీషు యువతి కదా. అందుకే పాలుగారే తన యవ్వనప్రాయానికి అనుగుణంగా బాయ్‌ఫ్రెండ్‌తో ఓ గాట్టి కిస్ ఒకటి వేసుకొని దాన్ని ఫోటోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టాంట్‌గా అప్లోడ్ చేసింది.