నాని బిగ్‌బాస్ షోని అద్భుతంగా ముగించాడు. టీవీ వ్యాఖ్యాతగా తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అయ్యాడు. వివాదాలకి దూరంగా ఉండే నేచురల్ స్టార్‌పై కొందరు బిగ్‌బాస్ అభిమానులు బురదజల్లే ప్రయత్నం చేశారు కానీ తన కూల్ యాటిట్యూడ్‌తో నాని వాటికి ముందే చెక్ పెట్టాడు.
"నా జీవితంలో ఇంత విద్వేషపూరితమైన సందేశాలను చూడలేదు. బిగ్‌బాస్ షోని కొందరు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అందులో జరిగే ప్రతి ఘటన నాకే అంటగట్టారు. ఈ షో వల్ల నాకు అర్థమైంది ఏంటంటే..మనల్ని ఇష్టపడని వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది..," ఇలా నాని తన బిగ్‌బాస్ షో అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.
తను నటించే ప్రతి సినిమాలోనూ ఎక్కువగా ఇన్‌వాల్వ్ అవుతాడు నేచురల్ స్టార్ నాని. ఇది అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని నాని కూడా ఒప్పుకుంటాడు. కానీ "దేవదాసు" సినిమా విషయంలో మాత్రం దానికి దూరంగా ఉన్నాడట. ఎందుకంటే ఈ సినిమాలో నాగార్జున కూడా నటించడమే.