మహా దర్శకుడు మణిరత్నం ఈ మధ్య కాలంలో తీసిన బెటర్ సినిమాల్లో ఇదొకటి అని పేరు తెచ్చుకొంది "నవాబ్". ఐతే ఆయన హార్డ్‌కోర్ అభిమానులు మాత్రం మణిరత్నం గొప్పగా తీయలేదని పెదవి విరిచారు. ఆ క్రిటిక్స్ మాట ఎలా ఉన్నా సాధారణ జనానికి బాగానే నచ్చినట్లు కనపిస్తోంది. ఐతే ఈ నచ్చడం అనేది కలెక్షన్ల రూపంలోకి ట్రాన్స్‌ఫర్ కాలేదు. నవాబు తెలుగులో ఫ్లాప్ అయింది. కలెక్షన్లలో పురోగతి పెద్దగా లేదు.