పెళ్లయిన తర్వాత హీరోయిన్‌గా మారడం అనేది రేర్. హీరోయిన్‌గా అడుగుపెట్టి 20 ఏళ్లు అయినా కూడా పెళ్లి చేసుకుంటే అవకాశాలు పోతాయామో అని వెనుకాడే భామలున్న టైమ్‌లో ఆకాంక్ష సింగ్...పెళ్లి తర్వాత హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. నిజంగా ఇది విశేషమే కదా.
మళ్లీ రావా చిత్రంతో తెలుగుతెరపై మెరిసింది ఆకాంక్ష. ఈ సినిమాలో మ్యూజిక్‌తో పాటు కాస్త మెప్పించిన విషయం ఏదైనా ఉందంటే ఈ అమ్మడి నటన, అందమే. క్రిటిక్స్ అందరూ ఆకాంక్షకి మంచి మార్కులే వేశారు.