విశాఖపట్నంలో జగదాంబ థియేటర్ల తర్వాత అంతగా పేరు తెచ్చుకున్న థియేటర్ కాంప్లెక్స్. దానికి కారణం వినాయక్. వి.వి.వినాయక్ దర్శకుడిగా టాప్ రేంజ్‌లో ఉన్నపుడు రెండు పాత థియేటర్లను కొన్నాడు. వైజాగ్‌లోని ఆ థియేటర్లలో ఆధునాతన వసతులను ఏర్పాటు చేసి విమాక్స్ పేరుతో బాగా పేరు తీసుకొచ్చాడు. తక్కువ టైమ్‌లోనే మేజర్ స్పాట్‌గా మారాయి ఆ థియేటర్లు. ఐతే ఇపుడు ఆ థియేటర్లు కనుమరుగు కానున్నాయి.