దర్శకుడు హరీష్ శంకర్ తన కొత్త సినిమా వర్క్‌ని మొదలుపెట్టాడు. త్వరలోనే సినిమా సెట్ మీదకి వెళ్లనుంది. తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకొని మంచి విజయం సాధించిన జిగర్ తండా అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు హరీష్. ఐతే ఆ సినిమాలోని మూలకథ, క్యారక్టరైజేషన్లు మాత్రమే తీసుకొని మిగతా అంత తనదైనశైలిలో మార్చేస్తున్నాడని సమాచారం.
ప్రచారం జరుగుతున్నట్లు మొత్తంగా కథని మార్చేస్తున్నాడనేది అబద్దం.