యువ దర్శకుడు ప్రశాంత్ వర్మకి హీరో డాక్టర్ రాజశేఖర్ చుక్కలు చూపిస్తున్నాడని గుసగుస వినిపిస్తోంది. నాని నిర్మించిన అ సినిమాతో పరిచయమైన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం కల్కి అనే సినిమాని డైరక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరో రాజశేఖర్. ఆయన కుటుంబ సభ్యులే సినిమాని నిర్మిస్తున్నారు.
ఐతే దర్శకుడు ప్రశాంత్ వర్మ అడిగినదేదీ ఇవ్వడం లేదని, ఎక్కువ టేక్‌లకి ఒప్పుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన యువ దర్శకుడు అలాంటిదేమీ లేదంటున్నాడు.