Krishnaarjuna Yuddham

నాని ముందుకెళ్తాడా? వెనక్కి వెళ్తాడా?

నాని స‌క్సెస్ గ్రాఫ్ ఇపుడు మామూలుగా లేదు. సౌత్ ఇండియాలో నాని రేంజ్‌లో వ‌రుస హిట్స్ ఇస్తున్న హీరో మ‌రొక‌రు లేరు. టాక్‌తో సంబంధం లేదు, రేటింగ్‌ల‌తో ముడిపెట్టేది లేదు. నానికి మేం మినిమం హిట్ ఇస్తామ‌ని తెలుగు ప్రేక్ష‌కులు తీర్మానించుకున్న‌ట్లు కనిపిస్తోంది.  ఈ ఊపులోనే నాని మ‌రో సినిమాకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. 

"కృష్ణార్జున యుద్ధం" సినిమాని ఏప్రిల్‌12న విడుద‌ల చేస్తామ‌ని నాని నిర్మాత‌లు రీసెంట్‌గా గ్రాండ్‌గా ప్ర‌క‌టించారు. అప్ప‌టికి ర‌జ‌నీకాంత్ సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు.

Subscribe to RSS - Krishnaarjuna Yuddham