Movie Artistes' Association

Surprise! Naga Babu lends support to Naresh

మాలో అంతా గ‌ప్‌చుప్‌

మొన్నటి వ‌ర‌కు తిట్టుకున్న న‌రేష్‌, శివాజీరాజీ ఇపుడు రాజీప‌డ్డారు. రాజీప‌డ్డారు అన‌డం క‌న్నా రాజీ ప‌డేలా చేశారు అన‌డం క‌రెక్ట్‌. మా అసోషియేష‌న్ 25 ఏళ్ల చ‌రిత్ర‌లో మొద‌టిసారిగా నిర్మాత‌లు క‌ల‌గచేసుకొని స‌మ‌స్య‌ని సాల్వ్ చేశారు. క‌లెక్టివ్ క‌మిటీ అనే ఒక కొత్త క‌మిటీని ఏర్పాటు చేసి ఇండ‌స్ట్రీలో పేరొందిన నిర్మాత‌లు మా స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించారు. మా నిధుల‌న్నీ గోల్‌మాల్ చేశాడ‌ని శివాజీరాజీపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

గోల్‌మాల్ శివాజీరాజా!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా)లో విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. మా అధ్యక్షుడు శివాజీ రాజా, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ న‌రేష్‌.. ఇద్ద‌రూ మీడియా ముందుకొచ్చి ఒక‌రిపై ఒక‌రు తిట్టుకున్నారు. ఆరోప‌ణలు చేసుకున్నారు. శివాజీరాజాది గోల్‌మాల్ వ్య‌వ‌హార‌మే అంటున్నాడు న‌రేష్‌.

నిజంగా శివాజీరాజా ఎలాంటి అక్ర‌మాల‌కి పాల్ప‌డ‌క‌పోతే విచార‌ణ‌కి ఎందుకు అంగీక‌రించ‌డం లేద‌ని అడుగుతున్నాడు న‌రేష్‌. ‘మా’  అధ్యక్షుడిగా శివాజీరాజా చేసిన గోల్‌మాల్ వ‌ల్లే ఇంత సీన్ క్రియేట్ అయిందంటున్నాడు.

నా ఆస్తంతా రాసిచ్చేస్తా

మా అసోషియేష‌న్ వివాదం ముదిరింది. మా నిధుల‌న్నింటిని శివాజీ రాజా, శ్రీకాంత్ అండ్ టీమ్ మొత్తం తినేసింద‌ని మా  కొంద‌రు స‌భ్యులు ఆరోప‌ణ‌లు చేశారు. రెండు రోజుల పాటు సాగిన వివాదంత ఇపుడు మ‌రింత ముదిరింది.

మా అధ్య‌క్షుడు శివాజీరాజా ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వారికి ఛాలెంజ్ విసిరాడు. నిధులు  దుర్వినియోగమైనట్లు నిరూపిస్త‌ నా ఆస్తంతా రాసిచ్చేస్తాన‌ని చెప్పాడు. అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కావాలనే కొందరు మాపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నాడు శివాజీరాజా.

Subscribe to RSS - Movie Artistes' Association
|

Error

The website encountered an unexpected error. Please try again later.