ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏముంటుంది, ఎన్టీఆర్ జీవిత చరిత్రే కదా! అని చాలా మంది నిర్లిప్తంగా అంటున్నారు. ఎన్టీఆర్ రాజకీయ జీవితంలోనే అసలైన డ్రామా ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్‌లో మజా ఏముంటుందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఐతే దర్శకుడు క్రిష్ మాత్రం ఎవరూ ఊహించని కోణాన్ని పట్టుకున్నాడనేది టాక్.
ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్‌లోనూ, ఆయన కెరియర్‌లోనూ ఇంత నాటకీయత ఉందా అని ఆశ్చర్యపడేలా సీన్లను రూపొందించాడట. అసలు క్రిష్ కథ మొదలుపెట్టి, మొదటి భాగం ఎండ్ చేసిన విధానంలోనూ ఎంతో ఎమోషన ఉందట. సినిమాకి సెంటిమెంట్ సీన్లు హైలెట్ అవుతాయని అంటున్నారు.