ప్రియా ప్రకాష్ వారియర్ గురించి పరిచయం అక్కర్లేదు. కన్నుగీటి కుర్రాళ్ల మనసు దోచుకున్న కేరళ కుట్టి నితిన్ సినిమాని సైన్ చేసింది. ఆ సినిమా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. నితిన్ హీరోగా ఐతే, అనుకోకుండా ఒక రోజు చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తీస్తున్న కొత్త సినిమాలో రెండో హీరోయిన్‌గా నటిస్తోంది ప్రియా ప్రకాష్. తెలుగులో ఆమెకిది మొదటి సినిమా.
ప్రియా వారియర్ గురించి పరిచయం అక్కర్లేదు. అంతగా పాపులర్ అయింది ఈ కేరళ కుట్టి. ఇంకా నిండా పద్దెనిమిది నిండని ఈ బ్యూటీ "లవర్స్ డే" సినిమాకి సంబంధించిన ఒక పాటలో కన్ను మీటి అందరి గుండెని మీటింది.
ఆ ఒక్క పాటతో ఓవర్ నైట్ సెన్సేషనల్ స్టార్ అయింది. ఐతే "లవర్స్ డే" సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా విడుదల కన్నా ముందే ఆమె బాలీవుడ్ లో ఒక మూవీ చేసింది. అదే "శ్రీదేవి బంగ్లా". ఇది వివాదాల్లో ఇరుక్కొంది. శ్రీదేవి మరణాన్ని క్యాష్ చేసుకునేలా ఈ సినిమా ప్రయత్నం చేస్తోందనేది వివాదం.
ప్రియా వారియర్‌ని అందరూ మరిచిపోయినట్లేనా అంటే సమాధానం ఔనని వస్తోంది. గత ఏడాది దేశమంతా సంచలనం సృష్టించింది ప్రియా వారియర్. ఆమె నటించిన తొలి సినిమా ఈ ఏడాది తెలుగులో "లవర్స్ డే" పేరుతో విడుదలయింది. తెలుగులోనే కాదు మలయాళం, హిందీ, తమిళం..అన్నీ భాషల్లో రిలీజ్ అయి ఢమాల్ అనిపించుకొంది.
మొదటి సినిమాతోనే ప్రియా క్రేజ్ తగ్గిపోయింది. ఆమె నటించిన రెండో మూవీ "శ్రీదేవి బంగ్లా"కి ఇపుడు క్రేజ్ లేదు. ప్రియా వారియర్ వన్ ఫిల్మ్ వండర్గానే మిగిలిపోతుందా?
ప్రియా ప్రకాష్ వారియర్.. ఇంటర్నెట్ సెన్సేషన్ ఈ భామ. ఈమె కన్నుగీటిన సన్నివేశం ఇంటర్నెట్ ను ఊపేసింది. కోట్లలో లైక్స్ తెచ్చిపెట్టింది. ఫలితంగా గూగుల్ మోస్ట్ సెర్చింగ్ సెలబ్రిటీగా మారిపోయింది ప్రియా వారియర్. అయితే ఏ సినిమాలోనైతే కన్నుగీటే సన్నివేశంతో పాపులర్ అయిందో, ఇప్పుడు అదే సినిమాలో మరో సన్నివేశానికి సంబంధించి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది ఈ బ్యూటీ.