"అర్జున్‌రెడ్డి", "గీత గోవిందం" సినిమాల్లో విజయ్ దేవరకొండ ఫ్రెండ్‌గా అద్భుతంగా అదరగొట్టాడు. "అర్జున్‌రెడ్డి" సినిమాలో రాహుల్ పాత్ర, అతని నటన సూపర్. మంచి ఇంటిలెజెంట్ అయిన రాహువల్ రామకృష్ణ.. ఇపుడు తెలుగులో బిజీ కమెడియన్. అతను, ప్రియదర్శి కలిసి హీరోలుగా నటించిన "మిఠాయి" సినిమా శుక్రవారం విడుదలయింది. అది మిఠాయి కాదు చేదు కాకరకాయ్ అని క్రిటిక్స్ తేల్చారు. ఐతే విడుదలైన మర్నాడే రాహల్ తన సినిమాకి వ్యతిరేకంగా తనే ట్వీట్ చేసుకోవడం కలకలం రేపింది.