Puppy

అత్త బాట‌లో స‌మంత‌!

నాగ చైత‌న్య‌, స‌మంత గ‌త అక్టోబ‌ర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఏడాది తిర‌గ్గానే వారు త‌ల్లితండ్రుల‌య్యారు. ఐతే వారు పేరెంట్స్ అయింది ఒక పప్పీకి. వారింట్లో ఈ ప‌ప్పికి రాచ‌మ‌ర్యాద‌లు మొద‌ల‌య్యాయి. ఈ ఆనందాన్ని స‌మంత ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసుకొంది.

ఆ ప‌ప్పీ ఫోటోని, దాన్ని చాలా అభిమానంగా చూస్తున్న చైత‌న్య‌, స‌మంత‌ల ఫోటోని ఆమె షేర్ చేసింది. చూస్తుంటే.. స‌మంత కూడా జంతు ప్రేమికురాలు అనిపిస్తోంది. స‌మంత అత్త అమ‌ల‌..దేశంలోనే పేరొందిన జంతు ప్రేమికురాలు, సంర‌క్ష‌కురాలు. బ్లూక్రాస్ పేరుతో ఆమె ఒక సంస్థ‌నే న‌డుపుతోంది.

అత్త‌కి త‌గ్గ కోడ‌లు అనిపించుకుంటోంది స‌మంత‌.

Subscribe to RSS - Puppy