విజయ్ దేవరకొండ నటించిన "డియర్ కామ్రేడ్" మే 31 నుంచి తప్పుకొంది. సూర్య సినిమా కోసం విజయ్ దేవరకొండ తన సినిమాని వాయిదా వేశాడు. విజయ్ దేవరకొండకి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో కూడా ఫాలోయింగ్ వచ్చింది. ఇపుడు సౌత్ అంతా తన సినిమాలకి మార్కెట్ ని పెంచుకునేందుకు భారీ స్కెచ్ వేశాడు. ఇక నుంచి తన సినిమాలని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నాడు.
ఇంతకుముందే తెలుగుసినిమా.కామ్ రాసినట్లు.. అఖిల్ ఈ సారి కాస్త పెద్ద హీరోయిన్‌తో నటించాలనుకుంటున్నాడు. మొత్తానికి ఇపుడు అది కుదిరింది. యూత్‌లో క్రేజ్ ఉన్న రష్మికతో అఖిల్ నటించనున్నాడు. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తీస్తున్న కొత్త సినిమాని అఖిల్ సైన్ చేశాడు. గీతాఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్లను కూడా సంప్రదించారు. కానీ ఫైనల్‌గా రష్మికనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట.