అతిలోక సుందరి శ్రీదేవి మరణం అందర్నీ షాక్‌కి గురి చేసింది. ఫిఫ్టీ ప్లస్‌లోనూ తరగని అందంతో అందరూ అసూయపడేలా ఉంటూ ఇటీవలే మామ్ సినిమాతో మరోసారి తన అభినయ కౌశలాన్ని చాటిన శ్రీదేవి గురించి ఇలాంటి వార్త వింటామని ఎవరూ ఊహించి ఉండరు. తన కూతురుని హీరోయిన్‌గా లాంచ్ చేసే పనిలో బిజీగా ఉన్న శ్రీదేవి గుండెపోటుతో మరణించడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేసింది.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వార్త విని షాక్‌లో ఉన్నాన్నారు. చిరంజీవితో ఆమె జగదేకవీరుడు అతిలోక సుందరి వంటి ఐకానిక్ బ్లాక్‌బస్టర్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఎస్పీ పరుశరామ్‌లోనూ నటించారు.