పవన్ కళ్యాణ్ కొంతకాలంగా తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. అందుకే... ఆంధ్రప్రదేశ్ లో తాను అటెండ్ కావలిసిన రాజకీయ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. మొన్నటివరకు ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్ తీసుకున్నారు. అయితే సడ్డెన్ గా పవన్ ... హరిద్వార్ వెళ్లడంతో ఆయన వెన్ను నొప్పిపై పుకార్లు లేచాయి. నడుము నొప్పి అనేది ఒక బహనా అని ... కొన్ని కార్యక్రమాలని తప్పించుకునేందుకు ఇలా చెప్పారని కామెంట్స్ వచ్చాయి. ఇది ఊహించే... జనసేన టీం తమ ప్రెస్ నోట్ లో క్లారిటీ ఇచ్చారు. వెన్ను నొప్పి ఉన్న కూడా హరిద్వార్ మీటింగ్ కి వెళ్లాల్సి వచ్చింది అని క్లారిఫికేషన్ ఇచ్చారు.