"అజ్ఞాతవాసి", "నా పేరు సూర్య" సినిమాల్లో అవకాశం వచ్చినపుడు అను ఇమ్మాన్యుయేల్ ఎక్కడికో వెళ్తుందనిపించింది. అగ్ర హీరోయిన్ల జాబితాలో ఖాయంగా ఉంటుందనుకున్నారంతా. కానీ రెండు సినిమాలు మెగా ఫ్లాప్ కావడంతో ఆమె ఆశలు గల్లంతయ్యాయి. అవకాశాలు తగ్గాయి. ఇపుడు చేతిలో ఒకే ఒక్క మూవీ ఉంది.