చేతిలో ఉన్న‌ది ఒకే సినిమా

Anu Emmanuel has only one film on hand
Monday, July 30, 2018 - 14:00

"అజ్ఞాత‌వాసి", "నా పేరు సూర్య" సినిమాల్లో అవ‌కాశం వ‌చ్చిన‌పుడు అను ఇమ్మాన్యుయేల్ ఎక్క‌డికో వెళ్తుంద‌నిపించింది. అగ్ర హీరోయిన్ల‌ జాబితాలో ఖాయంగా ఉంటుంద‌నుకున్నారంతా. కానీ రెండు సినిమాలు మెగా ఫ్లాప్ కావ‌డంతో ఆమె ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి. అవ‌కాశాలు త‌గ్గాయి. ఇపుడు చేతిలో ఒకే ఒక్క మూవీ ఉంది.

ర‌వితేజ స‌ర‌స‌న చేయాల్సిన "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" నుంచి కూడా ఆమెని తొల‌గించారు. ఐతే త‌నే త‌ప్పుకున్నాను అని ఆమె అంటోంది. మొత్త‌మ్మీద ఆమె చేతిలో ఉన్న ఆ ఒక్క మూవీ వ‌చ్చే నెల 31న విడుద‌ల కానుంది. మారుతి డైర‌క్ష‌న్‌లో రూపొందుతోన్న "శైల‌జారెడ్డి అల్లుడు" చిత్రంలో ఆమె చైత‌న్య స‌ర‌స‌న న‌టిస్తోంది. వ‌చ్చే నెల ఈ సినిమా కూడా విడుద‌లయితే ఆమె చేతిలో మ‌రో మూవీ ఉండ‌దు.

ఐతే కొత్త సినిమాల విష‌యంలో తొంద‌ర‌ప‌డ‌నుంటోంది ఈ అమెరిక‌న్ బ్యూటీ. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ మ‌ల‌యాళ సుంద‌రి ఒకే సమయంలో నాలుగైదు చిత్రాలు చేసేయాలని కోరుకోవడం లేదట‌. మంచి పేరు తెచ్చే సినిమాలు చేస్తానంటోంది. ఆఫ‌ర్లు త‌గ్గితే హీరోయిన్లు ఇలాంటి మాట‌లే చెపుతుంటారులెండి.