సునీత అఫైర్లు, రూమర్లు!

Sunitha talks about her love life
Wednesday, August 5, 2020 - 22:15

గాయని సునీత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆమె సహజీవనంలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని.. ఇలా రకరకాలుగా కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి రూమర్లపై ఆమె ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటో చెబుతోంది సునీత.

"రూమర్లు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. నేను ఒక దారిలో వెళ్తున్నాను. వ్యక్తిగతంగా కొన్ని ఘటనలు జరిగాయి. కానీ వెళ్తున్న దారిలో ఎప్పుడూ తలదించుకునే పని చేయలేదు. ఇంకొకరికి సమాధానం చెప్పే పరిస్థితి రాలేదు. ఎవరితోనో నన్ను లింకప్ చేసి మాట్లాడుతుంటే నేను స్పందించకపోవడానికి కారణం ఉంది. ఎందుకంటే ఆ లింకప్ రూమర్స్ లో నిజం ఏంటనేది నాకు, నా కుటుంబానికి తెలుసు. అందుకే నేను రియాక్ట్ అవ్వలేదు," అని తన అభిప్రాయాన్ని ప్రకటించింది.

ప్రస్తుతం తను సింగిల్ గానే ఉన్నట్టు స్పష్టం చేసింది సునీత. సోలో బ్రతుకే సో బెటర్ అంటోంది. సునితాకిద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ వయసుకొచ్చారు.