స్మాల్ స్క్రీన్ కు 'సరైనోడు'

Sarrainodu continues to rake in strong TV ratings.
Thursday, August 6, 2020 - 16:00

'సరైనోడు'.. అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా ఇప్పటిది కాదు. చాన్నాళ్ల కిందటిది. అయితేనేం బుల్లితెర ప్రేక్షకులకు అది ఎంత పాతదనేది అక్కర్లేదు. వినోదం అందించిందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఈ విషయంలో బుల్లితెరపై మరోసారి సరైనోడు అనిపించుకున్నాడు బన్నీ. ఈ వారం (జులై 25-జులై 31) రేటింగ్స్ లో మరోసారి మెరిసింది ఈ సినిమా.

బన్నీ-బోయపాటి కాంబోలో వచ్చిన ఈ సినిమాకు 5.77 (ఏపీ+నైజం టోటల్) టీఆర్పీ వచ్చింది. ఈ వీక్ సినిమా రేటింగ్స్ లో రెండో స్థానం ఈ మూవీదే. ఇప్పటికే ఎన్నోసార్లు టీవీల్లో ప్రసారమైనప్పటికీ మరోసారి ఈ సినిమాకు ఈ స్థాయి రేటింగ్ రావడం విశేషం. ఈమధ్య ప్రసారమైన కొన్ని కొత్త సినిమాలకు కూడా ఈ స్థాయి టీఆర్పీ రాలేదు.  

ఇక్కడే మరో విశేషం కూడా చెప్పుకోవాలి. ఇదే సినిమా డబ్బింగ్ వెర్షన్ హిందీ ఛానెల్ (సోనీ మ్యాక్స్)లో ప్రసారమైంది. ఈవారం హిందీ మూవీ ఛానెల్స్ రేటింగ్స్ లో "సరైనోడు" సినిమా టాప్-5లో నిలిచింది.

ఇలా ఇటు నార్త్, అటు సౌత్ లో ఈ సినిమా బుల్లితెరకు సరైనోడు అనిపించుకుంది.