'పెళ్లా? నాకు జస్ట్ ట్వంటీ వన్'

Yashika Anand denies wedding rumors
Wednesday, August 5, 2020 - 14:00

విజయ్ దేవరకొండ నటించిన "నోటా" సినిమా గుర్తుందా? అందులో సెకెండ్ హీరోయిన్ గా నటించింది యషికా ఆనంద్. ఇప్పుడీ ముద్దుగుమ్మ వార్తల్లో వ్యక్తిగా మారింది. ఆమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుందంటూ ప్రచారం జరగడమే దీనికి కారణం.

యషికా ఆనంద్ పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న ఫొటో ఒకటి 2 రోజుల కిందట లీక్ అయింది. దీంతో ఆమె ఈ లాక్ డౌన్ టైమ్ లో గుంభనంగా పెళ్లి చేసుకుందని కోలీవుడ్ మీడియా కథలు అల్లేసింది. తనపై జరుగుతున్న ఈ ప్రచారం చూసి షాక్ కు గురైంది ఈ బ్యూటీ. వెంటనే లైన్లోకి వచ్చింది.

కేవలం ఓ యాడ్ షూటింగ్ కోసం మాత్రమే తను అలా పెళ్లికూతురిలా ముస్తాబయ్యాయనని క్లారిటీ ఇచ్చింది యషిక. దీంతో ఆమెపై వచ్చిన పుకార్లు ఆగిపోయాయి. అంతేకాదు.. ఈ సందర్భంగా తన పెళ్లిపై చిన్నపాటి వివరణ కూడా ఇచ్చింది ఈ బ్యూటీ.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తన ప్రొఫెషన్ తోనే ప్రేమలో పడిందట. అంతేతప్ప, నిజజీవితంలో ఎవ్వరూ లేరంటోంది. అన్నట్లు ఆమె వయసు ...జస్ట్ 21.