ఏం నేర్చుకోలేదు: బెల్లంకొండ

Bellamkonda about his failures and successes
Wednesday, August 5, 2020 - 18:30

తను సాధించిన విజయాల నుంచి ఏం నేర్చుకోలేదంటున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. సక్సెస్ ల కంటే ఫెయిల్యూర్స్ నుంచే తను ఎక్కువగా పాఠాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. రీసెంట్ గా ఆరేళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న ఈ హీరో.. నిదానంగానే సినిమాలు చేస్తానంటున్నాడు.

"నిజమే, సినిమాల విషయంలో స్లోగానే ఉన్నాను. ఆరేళ్లలో 8 సినిమాలే చేశాను. ఇది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. అంతేకాదు, ఓవర్ ఎక్స్ పెరిమెంట్స్ కూడా చేయాలనుకోవడం లేదు. నా దగ్గరకొచ్చే కథల్లోంచి కొత్తగా ఉండేవి మాత్రమే ఎంపిక చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇకపై కూడా నా ప్రయాణం ఇలానే ఉంటుంది."

మంచి స్క్రిప్టులు ఎలా సెలక్ట్ చేసుకోవాలో అపజయాల నుంచి నేర్చుకున్నానని చెబుతున్నాడు బెల్లంకొండ. ఇప్పటికీ విజయాలు, అపజయాలు వస్తున్నప్పటికీ స్క్రిప్టుల విషయంలో మాత్రం తను తప్పుచేయలేదంటున్నాడు ఈ హీరో.