నన్ను కొనలేరు: అంకిత

I cannot be bought, Ankita Lokhande
Tuesday, August 4, 2020 - 18:00

సుశాంత్ సింగ్ మరణంతో తీవ్రంగా చలించిపోయింది ఆమె మాజీ ప్రియురాలు అంకితా లోఖండే. అతడు చనిపోయిన  నెల రోజులు మౌనం వహించింది. ఆ తరువాత తన సోషల్ మీడియా వాల్స్ పై భావోద్వేగమైన పోస్టులు పెడుతూనే ఉంది. తాజాగా మరింత లోతైన కొటేషన్ ను పెట్టింది అంకిత.

"ఒక్క జీవితంలో నన్ను లక్షల పనులు చేయమని వాళ్లు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికీ నేను నమస్కరించి చెబుతున్నాను.. నా కోసం కాదు, నేను భగవంతుని సృష్టిలో పవిత్రమైన దారిలో నడుస్తున్నాను. నేను నా మనసు చెప్పినట్టు నడుచుకుంటున్నాను. అది చెప్పినట్టు పాడుతున్నాను. నన్ను కొనలేరు.. నన్ను అమ్మలేరు."

ఇలా తన సోషల్ మీడియా పేజీలో భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది అంకిత. నిజానికి ఇది ఒక పోస్ట్ కాదు. ప్రముఖ రచయిత అరా సి.క్యాంప్ బెల్ కొటేషన్ ఇది. ఇంతకంటే ముందు మరో పోస్టు పెట్టిన అంకిత, అందులో ఎప్పటికైనా నిజమే నెగ్గుతుందంటూ సందేశం ఇచ్చింది.

సుశాంత్ తండ్రి పెట్టిన కేసు ఆధారంగా అతడి గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు బీహార్ పోలీసులు. ఇది జరిగిన మరుసటిరోజే అకింత ఇలా లోతైన పోస్ట్ పెట్టింది. సుశాంత్ మరణంపై విచారణ జరుపుతున్న బీహార్ పోలీసులు.. అంకిత స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.