ఈ కుక్కకి విశ్వాసం లేదు: నాగబాబు

Naga Babu's funny video about his pet dog
Wednesday, August 5, 2020 - 13:15

సోషల్ మీడియాలో నాగబాబు చాలా యాక్టివ్. మరీ ముఖ్యంగా యూట్యూబ్ లో ఆయన పెట్టే వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. కొన్ని రాజకీయ దుమారం రేపిన సందర్భాలు కూడా ఉన్నాయి. "అంతా నా ఇష్టం" అంటూ నాగబాబు చేసే హడావుడి పొలిటికల్ సర్కిల్ లో చాలామందికి తెలిసిందే. అలాంటి నాగబాబు ఈసారి "కుక్కకు విశ్వాసం లేదు" అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు.

నాగబాబు ఈ వీడియో రిలీజ్ చేసిన వెంటనే చాలామంది దాన్ని కూడా పొలిటికల్ యాంగిల్ లో చూశారు. ఈసారి నాగబాబు ఎవరిపై సెటైర్ వేశారా అనే ఆసక్తితో చాలామంది ఆసాంతం చూశారు. అయితే ఈసారి నాగబాబు ఎలాంటి పేరడీలు చేయలేదు. సెటైర్లు వేయలేదు. తన పెంపుడు కుక్కకు నిజంగానే విశ్వాసం లేదంటూ ఓ ఫన్నీ వీడియో పెట్టారంతే.

2016 నుంచి పీకూ అనే కుక్కను పెంచుకుంటున్నారు నాగబాబు. ఎవరైనా తన మీదకు వస్తే, తనకు ప్రమాదం జరుగుతుందని అనిపిస్తే.. ఆ కుక్క తన ప్రాణాలకు తెగించి పోరాడుతుందని ఇన్నాళ్లూ నాగబాబు అనుకున్నారట. అయితే ఈమధ్య ఓసారి రబ్బరు పాముతో భార్య భయాన్ని పోగొట్టేందుకు నాగబాబు ప్రయత్నించగా.. అతడ్ని వదిలేసి ఈ కుక్క కూడా లోపలకు పరుగులు తీసింది. అందుకే తన కుక్కకు విశ్వాసం లేదని, మనుషుల బుద్ధులు వచ్చేశాయని చమత్కరిస్తున్నారు నాగబాబు.