ఫటాఫట్ శృతిహాసన్

Quick Q and A with Shruti Haasan
Thursday, August 6, 2020 - 12:45

ఈ 3 నెలల టైమ్ లో ఎవ్వర్నీ పెద్దగా మిస్ అవ్వలేదంటోంది శృతిహాసన్. తనకు కావాల్సిన వ్యక్తులందరితో టచ్ లో ఉన్నానని చెబుతోంది. ఇక డేటింగ్ యాప్స్ విషయానికొస్తే.. ఇప్పటివరకు అలాంటివేవీ డౌన్ లోడ్ చేయలేదని చెబుతోంది. వీటితో పాటు మరికొన్ని..

- లాస్ట్ కాల్ ఎవరికి చేశారు?
నా ఫ్రెండ్ బ్రయిన్ కు చేశాను. అతడు తన జీవితంలో ఓ కొత్త వెంచర్ ప్రారంభించాడు.

- కరోనా తగ్గాక పార్టీలకు వెళ్తారా?
కచ్చితంగా ఇంట్లో ఉండడానికే ప్రాధాన్యమిస్తాను. ఎక్కువగా పార్టీలకు వెళ్లను. కరోనా తర్వాత ప్రపంచమంతా ఓపెన్ అయినా నాకు ఇంట్లో ఉండడమే ఇష్టం. నాతో నేను ఉండడమే ఇష్టం.

- లాక్ డౌన్ లో కొత్త వంటకం?
బనానా బ్రెడ్ ట్రై చేశాను.. సరిగ్గా రాలేదు

- కాలింగ్, మెసేజింగ్ లో ఏదిష్టం?
ఎక్కువగా కాల్ చేయడానికే ఇష్టపడతాను. మరీ మూడ్ లేకపోతే మెసేజ్ చేస్తా. మన మాటలతో అంతగా ప్రభావం చూపించలేనప్పుడు కొన్ని సందర్భాల్లో మెసేజ్ చేస్తుంటాను. కాలింగ్ మిస్ అయితే వాయిస్ నోట్ పెడుతుంటాను.