సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ మరో వైరల్ పిక్ రిలీజ్ చేసింది. రోజూ తనకు సంబంధించిన ఏదో ఒక స్టిల్ రిలీజ్ చేసి అభిమానులను ఊరించే ఈ ముద్దుగుమ్మ, ఈసారి మాత్రం ఓ పజిల్ వదిలింది. తన చిన్నప్పుడు స్కూల్ లో దిగిన గ్రూప్ ఫొటో వదిలింది.
32 ఏళ్ల కాజల్ అగర్వాల్ ఎప్పటికపుడు తన పెళ్లిని వాయిదా వేస్తోంది. తాజాగా మరోసారి ఆమె పెళ్లి పుకార్లు షికార్లు చేస్తుండడంతో ఈ భామ వెడ్డింగ్ గురించి మీడియాతో మాట్లాడింది. ఇపుడిపుడే పెళ్లి లేదట. తాను మేరేజ్ చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తల్లో ఇసుమంత కూడా నిజం లేదంటోంది.
అలాగే తాను ఎవర్నీ ప్రేమించడం లేదనీ, ఏ హీరోతో డేటింగ్‌లో లేనని కూడా తేల్చి చెప్పింది. ఒక తమిళ హీరోతో ఈ అమ్మడు బాగా డీప్‌గా డేటింగ్ చేస్తోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఐతే ఈ భామ మాత్రం అదంతా అబద్దమంటోంది. ఆ మాటకొస్తే.. సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లిచేసుకోనని అంటోంది.