తేజ దర్శకత్వంలో మరోసారి నటిస్తోంది కాజల్ అగర్వాల్. ఆమెని తెలుగుతెరకి పరిచయం చేసింది అతనే. తేజ తీసిన "లక్ష్మీ కల్యాణం" సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పదేళ్ల గ్యాప్ తర్వాత గతేడాది రానా హీరోగా ఆయన రూపొందించిన నేనే రాజు నేనే మంత్రిలోనూ నటించింది. ఈ సినిమా బాగా హిట్టయింది. అందులో రాధ అనే రాయలసీమ యువతిగా నటించి మెప్పించింది. అదే సెంటిమెంట్‌తో ఆమెని తన తాజా సినిమాలోనూ రిపీట్ చేశాడు.
రియల్ లైఫ్ లో కాజల్ మెంటాలిటీ మనకు తెలియదు కానీ, ఓ సినిమాలో మాత్రం ఆమె ఇలా నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతోందట. అవును.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఇలా డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా కనిపించబోతోందట కాజల్.
ఈ క్యారక్టర్ పై ఇప్పటికే ఓసారి రియాక్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ. తేజ దర్శకత్వంలో చేస్తున్న పాత్ర, తన కెరీర్ లోనే ది బెస్ట్ అంటూ కవచం ప్రమోషన్ టైమ్ లో చెప్పుకొచ్చింది. డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా నెగెటివ్ షేడ్స్ తో ఆ పాత్ర ఉంటుందంటూ ప్రస్తుతం లీకులు వస్తున్నాయి. ఈ పుకారే నిజమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రీసెంట్‌గా తెలుగు సినిమాలు చాలా బోల్డ్‌గా మారాయి. ఆర్ ఎక్స్ 100 సినిమాలో హీరో, హీరోయిన్ లవ్ మేకింగ్ (సెక్స్) చేసుకుంటున్నట్లు బోల్డ్‌గా చూపించారు. ఇపుడు తమిళ సినిమా మరో స్టెప్పు ముందుకెళ్లింది. బాలీవుడ్‌లో సూపర్‌హిట్టయిన క్వీన్ సినిమా రీమేక్‌లో కాజల్ నటిస్తోంది. ఈ సినిమాలో ఒక సీన్‌లో కాజల్ వక్షోజాలను మరో భామ పట్టుకున్నట్లు చూపించారు. తాజాగా విడుదలైన టీజర్‌లోనూ ఆ సీన్‌ని పెట్టారు.
ఈ ఏడాది ప్రారంభంలో తను ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడినట్టు కాజల్ ప్రకటించింది. ఆ వ్యాధి పేరు ఆటో ఇమ్యూన్ డిజార్డర్. మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి మనకే ఎదురుతిరిగే అరుదైన వ్యాధి ఇది. సాధారణంగా మనకు రోగాలు రాకుండా ఈ రోగనిరోధక శక్తి కాపాడుతుంది. కానీ ఇదే శక్తి, మన శరీరంలో ఉన్న కణాలకు వ్యతిరేకంగా కొన్ని నెగెటివ్ కణాల్ని ఉత్పత్తి చేస్తుంది. అదే ఆటో ఇమ్యూన్ డిజార్డర్.