కాజల్ కు డబ్బుపిచ్చి పట్టింది

Is Kajal Aggarwal money-minded?
Sunday, December 30, 2018 - 10:00

రియల్ లైఫ్ లో కాజల్ మెంటాలిటీ మనకు తెలియదు కానీ, ఓ సినిమాలో మాత్రం ఆమె ఇలా నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతోందట. అవును.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో ఇలా డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా కనిపించబోతోందట కాజల్.

ఈ క్యారక్టర్ పై ఇప్పటికే ఓసారి రియాక్ట్ అయింది ఈ ముద్దుగుమ్మ. తేజ దర్శకత్వంలో చేస్తున్న పాత్ర, తన కెరీర్ లోనే ది బెస్ట్ అంటూ కవచం ప్రమోషన్ టైమ్ లో చెప్పుకొచ్చింది. డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా నెగెటివ్ షేడ్స్ తో ఆ పాత్ర ఉంటుందంటూ ప్రస్తుతం లీకులు వస్తున్నాయి. ఈ పుకారే నిజమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈ సినిమాకు సీత అనే టైటిల్ అనుకుంటున్నారట. సినిమాలో కాజల్ పాత్ర పేరునే ఈ సినిమాకు టైటిల్ గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే మూవీ ఫస్ట్ లుక్ విడుదలకాబోతోంది.