30 దాటిన భామలకి సాధారణంగా క్రేజ్ తగ్గుతుంటుంది. కానీ కాజల్‌కి థర్టీప్లస్‌లో డిమాండ్ పెరిగింది. వరుసగా ఆమెకి ఆఫర్లు దక్కుతున్నాయి. కుర్ర హీరోయిన్లతో నటించే శర్వానంద్ వంటి హీరోలు కూడా తాజాగా ఆమెతో జత కడుతుండడం చెప్పుకోదగ్గ విశేషమే. వరుసగా హిట్స్ రావడంతో ఆమెకి క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఇపుడు మరింత అందంగా తయారైంది.
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ మొదలుపెట్టిన కొత్త సినిమాలో కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్. ఇక వెంకీ హీరోగా తేజ తీయనున్న కొత్త సినిమాలోనూ ఈ భామే కథానాయక. సైరా నర్సింహారెడ్డిలో ఒక కీలకమైన పాత్రలోనూ కాజల్‌ని తీసుకోవాలనుకుంటున్నారు.