కాజ‌ల్‌కి స‌డెన్‌గా ఎందుకింత డిమాండ్‌?

Kajal Aggarwal turns favourite for makers suddenly
Monday, November 27, 2017 - 15:30

30 దాటిన భామ‌ల‌కి సాధార‌ణంగా క్రేజ్ త‌గ్గుతుంటుంది. కానీ కాజ‌ల్‌కి థ‌ర్టీప్ల‌స్‌లో డిమాండ్ పెరిగింది. వ‌రుస‌గా ఆమెకి ఆఫ‌ర్లు ద‌క్కుతున్నాయి. కుర్ర హీరోయిన్ల‌తో న‌టించే శ‌ర్వానంద్ వంటి హీరోలు కూడా తాజాగా ఆమెతో జ‌త క‌డుతుండడం చెప్పుకోద‌గ్గ విశేష‌మే. వ‌రుస‌గా హిట్స్ రావ‌డంతో ఆమెకి క్రేజ్ పెరిగింది. అంతేకాదు ఇపుడు మ‌రింత అందంగా త‌యారైంది.

శ‌ర్వానంద్ హీరోగా సుధీర్ వ‌ర్మ మొద‌లుపెట్టిన కొత్త సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక హీరోయిన్‌. ఇక వెంకీ హీరోగా తేజ తీయ‌నున్న కొత్త సినిమాలోనూ ఈ భామే క‌థానాయ‌క‌. సైరా న‌ర్సింహారెడ్డిలో ఒక కీల‌క‌మైన పాత్ర‌లోనూ కాజ‌ల్‌ని తీసుకోవాల‌నుకుంటున్నారు.

నాని నిర్మాత‌గా రూపొందిస్తోన్న అ! అనే సినిమాలోనూ ఆమె ఒక పాత్రలో మెర‌వ‌నుంది. ఎమ్మెల్యేగా న‌టిస్తోన్న క‌ల్యాణ్‌రామ్ కొత్త సినిమాలోనూ ఈ చంద‌మామే అందచందం. మొత్త‌మ్మీద‌, కాజ‌ల్‌కి టాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింద‌నేది వాస్త‌వం. ఆ మ‌ధ్య ఆమె మేనేజ‌ర్ రోని ..డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దాంతో ఆమెకి అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని భావించారు అంతా. అయితే ఇపుడు ఆమె త‌ల్లితండ్రులే ఆమె కెరియ‌ర్‌ని మేనేజ్ చేస్తున్నారు. అలా ఇంకా బిజీగా మారింది.