ఒక్క సినిమా పరుశరామ్ రేంజ్‌ని మార్చేసింది. గీత గోవిందం సినిమాకి ముందు ఈ యువ దర్శకుడు కొన్ని సినిమాల్లో తన ప్రతిభని నిరూపించుకున్నాడు కానీ క్రిటిక్స్ తప్ప సామాన్య జనం ఆయన టాలెంట్‌ని గుర్తించలేదు. ఇపుడు ఒక్కసారిగా ఆయన్ని అందరూ పొగిడేస్తున్నారు. ఎందుకంటే గీత గోవిందం సినిమాని హిలేరియస్‌గా తీశాడు.ఆ సినిమా 60 కోట్ల రూపాయల షేర్ పొందింది. విజయ్ దేవరకొండ స్టార్‌డమ్‌ని పెంచింది.
"గీత గోవిందం" దర్శకుడు పరశురామ్ గీత మారింది. ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీసినా...ఆయన పేరు సామాన్య ప్రేక్షకులకి అంతగా పరిచయం లేదు. గీత గోవిందంతో ఒక్కసారిగా అందరి చూపు ఆయనపై పడింది. 55 కోట్ల రూపాయల బ్లాక్‌బస్టర్ ఈ మూవీ. ఇంత పెద్ద హిట్ రావడంతో నిర్మాతలంతా ఆయన వెంట పడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఒక మూవీ చేయమని అడిగాడని ఇటీవల ప్రచారం జరిగింది. ఐతే అది ఇపుడే ఉండదని అంటున్నాడు ఈ నర్సీపట్నం బాబు.