సెట్ చేసేది అల్లు అర‌విందే!

Allu Aravind will decide Parasuram's next
Monday, September 10, 2018 - 09:00

ఒక్క సినిమా ప‌రుశరామ్ రేంజ్‌ని మార్చేసింది. గీత గోవిందం సినిమాకి ముందు ఈ యువ ద‌ర్శ‌కుడు కొన్ని సినిమాల్లో త‌న ప్ర‌తిభ‌ని నిరూపించుకున్నాడు కానీ క్రిటిక్స్ త‌ప్ప సామాన్య జ‌నం ఆయ‌న టాలెంట్‌ని గుర్తించ‌లేదు. ఇపుడు ఒక్క‌సారిగా ఆయ‌న్ని అంద‌రూ పొగిడేస్తున్నారు. ఎందుకంటే గీత గోవిందం సినిమాని హిలేరియ‌స్‌గా తీశాడు.ఆ సినిమా 60 కోట్ల రూపాయ‌ల షేర్ పొందింది. విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్‌డ‌మ్‌ని పెంచింది.

పరుశ‌రామ్‌తో సినిమాలు చేసేందుకు హీరోలు, నిర్మాతలు పోటీ ప‌డుతున్నారు.  ఐతే ప‌రుశ‌రామ్‌కి త‌న నెక్స్ట్ సినిమా ఎవ‌రితో చేయాలి అనే విష‌యంలో ఫ్రీడం లేదు. పరుశ‌రామ్ తన త‌దుప‌రి చిత్రాన్ని అల్లు అర‌వింద్ బ్యాన‌ర్‌లోనే చేయాలి. ఐతే హీరో ఎవ‌రు అనేది అల్లు అర‌వింద్ మాత్ర‌మే డిసైడ్ చేస్తారు.  సాయి ధ‌ర‌మ్ తేజ హీరోగా ఈ సినిమా సెట్ అయ్యే అవ‌కాశం ఉంది. కానీ ఫైన‌ల్ నిర్ణ‌యం మాత్రం అల్లు అర‌విందే.