మహేష్‌బాబు, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల మధ్య స్నేహబంధం మరింత బలపడింది. గత ఏడాది, ఏడాదిన్నర కాలంగా ఈ త్రిమూర్తులు రెగ్యులర్‌గా కలుసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ మధ్య అంతకుముందు నుంచే ఫ్రెండ్సిప్ ఉంది. అంతేకాకుండా, చరణ్, ఎన్టీఆర్ త్వరలో కలిసి రాజమౌళి సినిమాలో నటించనున్నారు. దాంతో ఇద్దరి ఫ్యామిలీస్ మధ్య స్నేహం పెరిగింది. పిల్లల బర్త్‌డేల పార్టీలకి వెళ్లడం, వారికి సోషల్ మీడియాలో వీడియో సందేశాలు ఇవ్వడం కూడా చేస్తున్నారు.
రామ్‌చరణ్ తన చెల్లెలు సినిమాకి కంపల్సరీగా ప్రమోట్ చేస్తాడన్నమాట. ఆమె నటించిన మొదటి సినిమా ఒక మనసు మూవీ ప్రమోషన్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చాడు. ఇపుడు హ్యాపీ వెడ్డింగ్ ప్రీ రిలీజ్‌కి కూడా చరణే మెయిన్ స్టార్ గెస్ట్‌గా విచ్చేశాడు. ఇప్పటి వరకు హ్యాపీ వెడ్డింగ్ సినిమా మీద హైప్ రాలేదు. అందుకే నీహారిక సినిమాకి తనే వచ్చి ప్రమోషన్‌కి ఊపు తీసుకొస్తున్నాడు.