ముదిరిన మ‌హేష్‌, ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ దోస్తీ

Ram Charan, NTR and Mahesh Babu's thick friendship
Friday, July 27, 2018 - 23:15

మ‌హేష్‌బాబు, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల మ‌ధ్య స్నేహ‌బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. గ‌త ఏడాది, ఏడాదిన్న‌ర కాలంగా ఈ త్రిమూర్తులు రెగ్యుల‌ర్‌గా క‌లుసుకుంటున్నారు, పార్టీలు చేసుకుంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మ‌ధ్య అంత‌కుముందు నుంచే ఫ్రెండ్సిప్ ఉంది. అంతేకాకుండా, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ త్వ‌ర‌లో క‌లిసి రాజ‌మౌళి సినిమాలో న‌టించ‌నున్నారు. దాంతో ఇద్ద‌రి ఫ్యామిలీస్ మ‌ధ్య స్నేహం పెరిగింది. పిల్ల‌ల బ‌ర్త్‌డేల పార్టీల‌కి వెళ్ల‌డం, వారికి సోష‌ల్ మీడియాలో వీడియో సందేశాలు ఇవ్వ‌డం కూడా చేస్తున్నారు.

ఇపుడు మ‌హేష్‌బాబు కూడా చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ టీమ్‌లో చేరాడు. ముగ్గురూ కామ‌న్ ఫ్రెండ్స్‌తో క‌లిసి రెగ్యుల‌ర్‌గా పార్టీలు చేసుకుంటున్నారు. టాలీవుడ్ అగ్ర హీరోల మ‌ధ్య దోస్తీ... అభిమానుల మ‌ధ్య కూడా హెల్తీ వాతావార‌ణాన్ని క్రియేట్ చేస్తోంది. ఇదివ‌ర‌లా ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకోవ‌డం త‌గ్గింది.

ఈ ఫోటో...శుక్ర‌వారం (జులై 27, 2018) తీసిన‌ది. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి బర్త్‌డే సంబ‌రాల్లో వీరు క‌లిశారు. వంశీ పైడిప‌ల్లి ఈ ముగ్గురూ హీరోల‌కి బాగా క్లోజ్‌. ఎన్టీఆర్‌తో బృందావ‌నం, రామ్‌చ‌ర‌ణ్‌తో ఎవ‌డు చిత్రాలు తీశాడు. ఇపుడు మ‌హేష్‌బాబు 25వ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అన్న‌ట్లు వంశీ పైడిప‌ల్లి 40లోకి ఎంట‌ర్ అయ్యాడు.