గతంలో ఓ తెలుగు సినిమా షూటింగ్ టైమ్‌లో ఒక హీరో పిచ్చిగా ప్రవర్తిస్తే ..గట్టిగా సమాధానం ఇచ్చాను ఆ హీరోకి అని చెప్పింది రాధిక ఆప్టే. ఇపుడు ఓ తమిళ సినిమా గురించి మాట్లాడింది. మరో దక్షిణాది సినిమా షూటింగ్‌లో చేదు అనుభవం చూశానని చెప్పింది రాధిక ఇపుడు.
భావ దారిద్ర్యం అంటే ఇదే. "అర్జున్‌రెడ్డి" సినిమాని తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాని తెలుగులో కూడా డబ్‌చేసి ఏకకాలంలో విడుదల చేస్తారట. ఇంతకన్నా కామెడీ ఉంటుందా? "వర్మ" సినిమాని చేస్తున్న బాలా గొప్ప దర్శకుడే. అందులో సందేహం లేదు. కానీ మన దగ్గర సంచలనం సృష్టించిన సినిమాని తమిళంలో తీసి మళ్లీ మన భాషలో అనువదించి విడుదల చేయడం ఏంటి?