అందుకే సౌత్‌లో న‌టించ‌డం మానేశా!

Radhika Apte talks about a bad experience
Saturday, November 10, 2018 - 15:15

గ‌తంలో ఓ తెలుగు సినిమా షూటింగ్ టైమ్‌లో ఒక హీరో పిచ్చిగా ప్ర‌వ‌ర్తిస్తే ..గ‌ట్టిగా స‌మాధానం ఇచ్చాను ఆ హీరోకి అని చెప్పింది రాధిక ఆప్టే. ఇపుడు ఓ త‌మిళ సినిమా గురించి మాట్లాడింది. మరో ద‌క్షిణాది సినిమా షూటింగ్‌లో చేదు అనుభ‌వం చూశాన‌ని చెప్పింది రాధిక ఇపుడు.

ఓ ద‌క్షిణాది ద‌ర్శ‌కుడు అర్జెంట్‌గా ఆడిషన్‌కు రమ్మన్నాడు. తీరా అక్క‌డికి వెళితే.. ఆ హోట‌ల్ ద‌రిద్రంగా ఉంది. ఇక ఆడిష‌న్ పేరుతో కురుచ దుస్తులు వేయించారు. ఆ డ్రెస్సు వేసుకోగానే ఫోటోలు తీయడం మొద‌లుపెట్టారు. ఆ ద‌ర్శ‌కుడు, ఆ టీమ్ అంతా బ్యాడ్‌గా బిహేవ్ చేసింద‌ని వెల్లడించింది. ఆడిష‌న్ పేరు చెప్పి కొన్ని డ్యాన్స్ స్టెప్పులు కూడా వేయించార‌ట‌.

ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఇక‌పై ద‌క్షిణాది చిత్రాల్లో న‌టించ‌కూడద‌ని నిర్ణ‌యించుకుంద‌ట‌. ఆ త‌ర్వాత ఆమె సౌత్‌లో సినిమా చేయ‌లేదంటోంది. అన్న‌ట్లు ఆ సినిమా మొద‌లుకాకుండానే ఆగిపోయింద‌ట‌.