త్రివిక్రమ్ తీస్తున్న "అరవింద సమేత"లో పూజా హెగ్డే పాత్ర పేరు అరవింద. అరవిందని దక్కించుకునేందుకు వీర రాఘవుడి చేసే పోరాటమే ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్. విడుదలైన తొలి టీజర్‌లో వీర రాఘవుడి విశ్వరూపం చూశాం. కానీ టీజర్‌లో ఒక్క ఫ్రేమలోనూ అరవింద అర విందం కూడా కనిపించలేదు. అందుకే కాబోలు తాజాగా పూజా సినిమా సెట్‌లోని ఒక ఫోటోని షేర్ చేసింది.