ఆలోచ‌న‌ల్లో అర‌వింద‌

Pooja Hegde posts pic from Aravindha Sametha sets
Sunday, August 19, 2018 - 00:45

త్రివిక్ర‌మ్ తీస్తున్న "అర‌వింద స‌మేత‌"లో పూజా హెగ్డే పాత్ర పేరు అర‌వింద‌. అర‌వింద‌ని ద‌క్కించుకునేందుకు వీర రాఘ‌వుడి చేసే పోరాటమే ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్‌. విడుద‌లైన తొలి టీజ‌ర్‌లో వీర రాఘ‌వుడి విశ్వ‌రూపం చూశాం. కానీ టీజ‌ర్‌లో ఒక్క ఫ్రేమ‌లోనూ అర‌వింద అర విందం కూడా క‌నిపించ‌లేదు. అందుకే కాబోలు తాజాగా పూజా సినిమా సెట్‌లోని ఒక ఫోటోని షేర్ చేసింది. 

ఆమె సెట్‌లో ఏదో ఆలోచ‌న‌ల్లో ఉండ‌గా ఫోటోగ్రాఫ‌ర్ క్లిక్‌మ‌నిపించాడు. ఆ ఫోటోని ఆమె బిహిండ్ ది సీన్స్ పేరుతో షేర్ చేసింది. ఎన్టీఆర్‌తో ఆమె న‌టిస్తున్న తొలి సినిమా. అల్లు అర్జున్‌తో డీజేలో అద‌ర‌గొట్టిన పూజా రంగ‌స్థ‌లంలో రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి జిగేల్‌రాణి పాట‌కి డ్యాన్స్ చేసింది. ఎన్టీఆర్‌తో పాటు తాజాగా మ‌హేష్‌బాబు సినిమాలోనూ న‌టిస్తోంది పూజా హెగ్డే.