ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్-ఆర్-ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత యంగ్ టైగర్ చేయబోయే సినిమా ఫిక్స్ అయింది. మరోసారి త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ మేరకు అనధికారికంగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది నిజం కూడా.
ఈ ఏడాది సునీల్ మళ్లీ కమెడియన్ అవతారం ఎత్తాడు. హీరో వేషాలతో ఫ్లాప్‌లు రావడంతో అవి వదిలి కమెడియన్ వేషాలు వేస్తున్నాడు. ఐతే అవేవీ విజయాలను అందించడం లేదు. తాజాగా విడుదలైన "పడి పడి లేచే మనసు" సినిమాలోనూ ఎన్నారై బావగా నటించాడు. కానీ మునుపటి నవ్వులు లేవు. ఆ జోష్ లేదు. ఈ సినిమాకి క్రిటిక్స్ అంతా తంబ్స్ డౌన్ అన్నారు.
సునీల్ ఈ ఇయర్ నటించిన అరవింద సమేత, అమర్ అక్బర్ ఆంటోనీ, సిల్లీ ఫెలోస్... ఇలా ఏవీ వర్కవట్ కాలేదు. అరవింద సమేత విజయం సాధించినా.. సునీల్ పాత్ర డమ్మీ. ఆయనకి కమెడియన్‌గా కలిసొచ్చింది ఏమీ లేదు. 2018లోనూ సునీల్‌కి బ్యాడ్‌టైమే కనిపించింది.