సునీల్‌కి టైమ్ క‌లిసి రావ‌డం లేదా

Sunil's bad phase continues
Saturday, December 22, 2018 - 09:15

ఈ ఏడాది సునీల్ మ‌ళ్లీ క‌మెడియ‌న్ అవ‌తారం ఎత్తాడు. హీరో వేషాల‌తో ఫ్లాప్‌లు రావ‌డంతో అవి వ‌దిలి క‌మెడియ‌న్ వేషాలు వేస్తున్నాడు. ఐతే అవేవీ విజ‌యాల‌ను అందించ‌డం లేదు. తాజాగా విడుద‌లైన "ప‌డి ప‌డి లేచే మ‌న‌సు" సినిమాలోనూ ఎన్నారై బావ‌గా న‌టించాడు. కానీ మునుప‌టి న‌వ్వులు లేవు. ఆ జోష్ లేదు. ఈ సినిమాకి క్రిటిక్స్ అంతా తంబ్స్ డౌన్ అన్నారు. 

సునీల్ ఈ ఇయ‌ర్ న‌టించిన అర‌వింద స‌మేత‌, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ, సిల్లీ ఫెలోస్‌... ఇలా ఏవీ వ‌ర్క‌వ‌ట్ కాలేదు. అర‌వింద స‌మేత విజ‌యం సాధించినా.. సునీల్ పాత్ర డ‌మ్మీ. ఆయ‌న‌కి క‌మెడియ‌న్‌గా క‌లిసొచ్చింది ఏమీ లేదు. 2018లోనూ సునీల్‌కి బ్యాడ్‌టైమే కనిపించింది. 

మ‌రి కొత్త ఏడాదిలో అయినా సునీల్ ఫేట్ తిరుగుతుందా అనేది చూడాలి.