కామెడీ పంచులతో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ

NTR and Trivikram's next confirmed
Monday, November 18, 2019 - 08:45

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్-ఆర్-ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ మూవీ తర్వాత యంగ్ టైగర్ చేయబోయే సినిమా ఫిక్స్ అయింది. మరోసారి త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఈ మేరకు అనధికారికంగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అది నిజం కూడా.

త్రివిక్రమ్ తో కలిసి అరవింద సమేత సినిమా చేశాడు ఎన్టీఆర్. ఆ మూవీ కంప్లీట్ సీరియస్ మోడ్ లో నడుస్తుంది. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఎనర్జీ, త్రివిక్రమ్ పంచ్ లు అందులో మిస్ అయ్యాయి. అందుకే ఈసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ ఇద్దరు. ఈసారి ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్.. ఇలా అన్నీ ఉంటాయట.

నిజానికి ఆర్-ఆర్-ఆర్ కంప్లీట్ అయిన తర్వాత కొరటాలతో సినిమా చేయాలని అనుకున్నాడు ఎన్టీఆర్. జనతా గ్యారేజ్ మేజిక్ ను రిపీట్ చేయాలని భావించాడు. కానీ కొరటాల మరికొన్నాళ్లు మెగా కాంపౌండ్ లోనే ఉండేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఎగ్రిమెంట్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. 

అందుకే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు ఎన్టీఆర్. అల వైకుంఠపురములో సినిమా తర్వాత పూర్తిగా ఎన్టీఆర్ ప్రాజెక్టుపైనే దృష్టిపెట్టబోతున్నాడట త్రివిక్రమ్.