బిగ్ బాస్ 3 సీజన్లో ముందే బయటికొచ్చింది హేమ. చివరి వరకు పోటీలో ఉంటుందనుకున్నారు. ఆమె పెద్ద తోపు అన్నారు. కానీ తోపు అక్కని తొక్కేశారట. ఈ మాట ఆమె అంటోంది. హౌజ్లో రాహుల్ తో లొల్లి జరిగిన మాట నిజమే. ఐతే అందులో నా తప్పు తక్కువ అంటోంది హేమ.
అక్క, వదిన, అమ్మ పాత్రలు పోషించే హేమ... బిగ్ బాస్ విషయంలో చాలా ఆశలు పెట్టుకొంది. అవన్నీ ఆడియాసలే అయ్యాయి. కనీసం మూడు, నాలుగు వారాలు కూడా రేసులో నిలబడలేదు. 100 రోజుల పాటు సాగుతుంది ఈ సీజన్. హేమకున్న పేరు ప్రకారం ఆమె కనీసం ఓ యాభై రోజులైన ఉండాలి. కానీ తోపు అక్కని మొదట్లోనే తోసేశారు.