కావాలనే తొక్కేశారంటున్న తోపు అక్క

Hema says politics behind her elimination
Monday, July 29, 2019 - 15:15

బిగ్ బాస్ 3 సీజన్లో ముందే బయటికొచ్చింది హేమ. చివరి వరకు పోటీలో ఉంటుందనుకున్నారు. ఆమె పెద్ద తోపు అన్నారు. కానీ తోపు అక్కని తొక్కేశారట. ఈ మాట ఆమె అంటోంది. హౌజ్లో రాహుల్ తో  లొల్లి జరిగిన మాట నిజమే. ఐతే అందులో నా తప్పు తక్కువ అంటోంది హేమ.

అక్క, వదిన, అమ్మ పాత్రలు పోషించే హేమ... బిగ్ బాస్ విషయంలో చాలా ఆశలు పెట్టుకొంది. అవన్నీ ఆడియాసలే అయ్యాయి. కనీసం మూడు, నాలుగు వారాలు కూడా రేసులో నిలబడలేదు. 100 రోజుల పాటు సాగుతుంది ఈ సీజన్. హేమకున్న పేరు ప్రకారం ఆమె కనీసం ఓ యాభై రోజులైన ఉండాలి. కానీ తోపు అక్కని మొదట్లోనే తోసేశారు.

ఇందులో చాలా రాజకీయం ఉందని ఆమె బయటికొచ్చిన తర్వాత చేసిన కామెంట్. ఇలాంటి కామెంట్లు, విమర్శలు కామనే. ఐతే ఈ షో ఇపుడు మరింత రసకందాయంలో పడింది.