రామ్ హీరోగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న `హలో గురు ప్రేమ కోసమే` పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నారు.
`సినిమా చూపిస్త మావ, నేను లోకల్` వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నారు.
టైమ్ కలిసిరానపుడు ఎన్ని సెంటిమెంట్‌లు అయినా వర్కవుట్ కావు అనేది చాలా మంది మాట. రామ్ పరిస్థితి ఇపుడు అలాగే ఉంది. "ఉన్నది ఒకటే జిందగీ" సినిమా ఫ్లాప్ కావడంతో అర్జెంట్‌గా హిట్ కావాలనే ఉద్దేశంతో దిల్‌రాజు సినిమాని ఒప్పుకున్నాడు రామ్. అంతకుముందు దిల్‌రాజు బ్యానర్‌లో "రాజా ది గ్రేట్" సినిమాని చేసేందుకు ఒప్పుకోలేదు. పారితోషికం విషయంలో వచ్చిన పేచీ కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. అది హిట్ కావడంతో ఈ సారి రామ్ తగ్గాడు. రామ్ దిల్‌రాజు సినిమా ఒప్పుకున్న టైమ్‌లో నిర్మాతగా ఆయన సూపర్ స్థితిలో ఉన్నాడు. వరుసగా ఆరు హిట్స్ ఇచ్చి ఒక ప్రౌడ్ పొజిషన్‌లో ఉన్నాడు దిల్ రాజు.