హలో గురు ప్రేమకోసమే పాటలు విడుదల

రామ్ హీరోగా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందుతోన్న `హలో గురు ప్రేమ కోసమే` పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా నటించారు. ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నారు.
`సినిమా చూపిస్త మావ, నేను లోకల్` వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 18న రిలీజ్ చేయనున్నారు.
"సినిమాకు సంబంధించిన టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మా బ్యానర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలకు సంగీతం అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలు మార్కెట్లోకి విడుదలయ్యాయి. సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. ఈ నెల 10న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. అలాగే అక్టోబర్ 13న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహిస్తున్నాం. దసరా సందర్భంగా అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం," నిర్మాత దిల్ రాజు అన్నారు.
- Log in to post comments