Karanataka

Show must go on, says Anasuya

ప్ర‌మాదానికి గురైన అన‌సూయ కారు

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ ప్రయాణిస్తున్నకారు ప్ర‌మాదానికి గురైంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్నకారుని  మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనసూయకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం. ఆమె మరో కారులో అనంతపురం చేరుకున్నారు.

బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.  ఇటీవ‌ల ఆమె త‌న కుటుంబ సభ్యుల‌తో క‌లిసి క‌ర్ణాట‌క‌లోని హిల్‌స్టేష‌న్ కూర్గ్‌కి విహార యాత్ర‌కి వెళ్లారు. అక్క‌డి నుంచి బెంగుళూర్‌కి చేరుకొని తిరిగి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

Subscribe to RSS - Karanataka