ప్రమాదానికి గురైన అనసూయ కారు
Submitted by admin on Wed, 2017-05-03 19:10
Actress Anasuya meets with a car accident
Wednesday, May 3, 2017 - 19:00

ప్రముఖ యాంకర్, నటి అనసూయ ప్రయాణిస్తున్నకారు ప్రమాదానికి గురైంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్నకారుని మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనసూయకు చిన్నపాటి గాయాలైనట్లు సమాచారం. ఆమె మరో కారులో అనంతపురం చేరుకున్నారు.
బెంగళూరు నుంచి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని హిల్‌స్టేషన్ కూర్గ్‌కి విహార యాత్రకి వెళ్లారు. అక్కడి నుంచి బెంగుళూర్‌కి చేరుకొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
- Log in to post comments