కార్తికేయ ఈ ఏడాది ఇప్పటికే హీరోగా హిప్పీ , గుణ 369 సినిమాలు రిలీజ్ చేసాడు. అలాగే గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించాడు. అది కూడా విడుదలైంది. అంటే ఈ ఏడాది ఇప్పటికే మూడు సినిమాలు తీసుకొచ్చాడు. ఇప్పుడు నాలుగో సినిమా రిలీజ్ చేస్తున్నాడు.
ఆర్‌ఎక్స్100తో వచ్చిన ఫేమ్‌ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ కాలేదు కార్తీకేయ. ఆ సినిమాలో హీరోగా నటించి ఫోకస్‌లోకి వచ్చాడు. వెంటవెంటనే చాలా సినిమా ఆఫర్లను లాగేశాడు. ఐతే ఆ హడావుడిలో నటించిన 'హిప్పీ', 'గుణ 369' సినిమాలు విడుదలై అపజయం పాలు అయ్యాయి. ఇక వచ్చే వారం అతను విలన్‌గా నటించిన తొలి మూవీ 'నానిస్ గ్యాంగ్‌లీడర్' రిలీజ్ అవుతోంది. దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ఆ సినిమా సూపర్ హిట్టయినా.. హీరోగా అతనికి వచ్చే బెనిఫిట్ ఏమీ లేదు. హీరోగా మళ్లీ సత్తా చాటుకోవాల్సిందే. ఎందుకంటే అది నాని సినిమా. క్రెడిట్ ఏదైనా నానికే వెళ్తుంది. నటుడిగా మాత్రం కార్తీకేయకి మార్కలు పడొచ్చు.