కార్తీకేయ తగ్గట్లేదు

Kartikeya announces his next film
Thursday, September 5, 2019 - 22:15

ఆర్‌ఎక్స్‌100తో వచ్చిన ఫేమ్‌ని నిలబెట్టుకోవడంలో సక్సెస్‌ కాలేదు కార్తీకేయ. ఆ సినిమాలో హీరోగా నటించి ఫోకస్‌లోకి వచ్చాడు. వెంటవెంటనే చాలా సినిమా ఆఫర్లను లాగేశాడు. ఐతే ఆ హడావుడిలో నటించిన 'హిప్పీ', 'గుణ 369' సినిమాలు విడుదలై అపజయం పాలు అయ్యాయి. ఇక వచ్చే వారం అతను విలన్‌గా నటించిన తొలి మూవీ 'నానిస్‌ గ్యాంగ్‌లీడర్‌' రిలీజ్‌ అవుతోంది. దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఒకవేళ ఆ సినిమా సూపర్‌ హిట్టయినా.. హీరోగా అతనికి వచ్చే బెనిఫిట్‌ ఏమీ లేదు. హీరోగా మళ్లీ సత్తా చాటుకోవాల్సిందే. ఎందుకంటే అది నాని సినిమా. క్రెడిట్‌ ఏదైనా నానికే వెళ్తుంది. నటుడిగా మాత్రం కార్తీకేయకి మార్కలు పడొచ్చు. 

ఇక ఇపుడు కెరియర్‌ని సెట్‌ చేసుకునే పనిలో పడ్డాడు. 'ఆర్‌ఎక్స్‌100' సినిమాని ఎలాగైతే తన కుటుంబ సభ్యులతో సినిమాని నిర్మింపచేశాడో ఇపుడు మరో సినిమాని ప్రొడ్యుస్‌ చేయిస్తున్నాడు. అందులో హీరో అతనే. ఈ సినిమా కూడా వెరైటీ టైటిల్‌తో వస్తుందట. 'ఆర్‌ఎక్స్‌100'లాగే ఇది కూడా హిట్‌ అయి తనని మళ్లీ హీరోగా నిలబెడుతుందని నమ్మకంగా ఉన్నాడు. 

ఇక్కడ ఇండస్ట్రీలో కేవలం లక్‌ మీద నిలబడేవారు తక్కువ. టాలెంటే లాంగ్‌ రన్‌ చూపిస్తుంది. ఆ విషయం ఇపుడు అర్థం చేసుకున్నాడు కార్తీకేయ. ఇక పరిగెత్తి పాలు తాగడట. నిలకడగా నీళ్లు తాగుదాం అనుకుంటున్నాడు. గుడ్‌ గోయింగ్‌!