మోహన్‌లాల్ ఇటీవల నటించిన "లూసిఫర్" సినిమా సంచలన విజయం సాధించింది. మలయాళంలో రూపొందిన ఈ పొలిటికల్ థ్రిల్లర్‌ని తెలుగులోనూ అదే పేరుతో డబ్ చేశారు. ఇక్కడ కూడా సూపర్‌గానే ఆడింది. ఈ సక్సెస్‌ని చూసి ఇపుడు దీనికి సీక్వెల్‌ని ప్రకటించాడు దర్శకుడు పృథ్వీరాజ్.